ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రత పై అవగాహన
మైలవరం, న్యూస్ వెలుగు; కడప జిల్లా మైలవరం మండలం వద్దిరాల గ్రామంలో జంగం కాలనీలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఫ్రైడే- డ్రైడే విష జ్వరాలు కార్యక్రమాన్ని పరిశీలించుటకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే. నాగరాజు జిల్లా డిప్యూటీ డి ఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, స్థానిక వైద్యాధికారులు డాక్టర్ ప్రణీత్ కుమార్, డాక్టర్ ఎస్.హుస్సేన్ బాష S.U.O N.నారాయణరెడ్డి,వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొని ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించి జ్వర అనుమానితులకు, పరీక్షలు చేసి తగు మందులు సూచనలు ఇవ్వడం జరిగినది. అలాగే నీటి నిల్వలలు ఏదైనా దోమ లార్వాలను పరిశీలించి కనుగొని వాటిని తొలగించడం అయినది. ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రత పై వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించడం జరిగినదని ఈ గ్రామం ఎలాంటి జ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని దాదాపు రెండు వారాలపాటు ఈ సర్వేని పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు డాక్టర్ కే.నాగరాజు ఆదేశించారు.