
అణగారిన కులాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు బాబు జగ్ జీవన్ రామ్….
ఎమ్మార్పీఎస్ కో కన్వీనర్ రాంకొండ ఎస్ వెంకటేశ్వర్లు
తుగ్గలి, న్యూస్ వెలుగు; భారత దేశ చరిత్రలో అట్టడుగున ఉన్న బడుగుబలహీన అణగారిన వర్గాల అభ్యుదయానికి నాంది పలికిన గొప్ప మేధావి భారత దేశం సగర్వించిన భారతదేశ మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా..తుగ్గలి మండలంలోని రాంకొండ గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రాంకొండ ఎస్ వెంకటేశ్వర్లు స్వగృహంలో బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యావత్ భారత దేశంలో అణగారిన వర్గాల కులాల ప్రజల అభ్యుదయానికి బాటలు వేస్తూ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు స్వర్గీయ బాబు జగజ్జివన్ రావు గారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రామ్ లక్ష్మణ్,జి హరికృష్ణ విద్యార్ధిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.