చిన్నారి షేక్ హీన కు మెరుగైన వైద్యం అందించాలి

చిన్నారి షేక్ హీన కు మెరుగైన వైద్యం అందించాలి

కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్

కర్నూలు, న్యూస్ వెలుగు : కర్నూలు నగరంలోని స్థానిక బండిమెట్ట MPL.CORP PRIMARY SCHOOLలో 3వ తరగతి చదువుతున్న చిన్నారి షేక్ హీన స్కూల్ గ్రౌండ్ లో తోటి విద్యార్థినిలతో ఆడుకుంటుడగా చిన్నారులు అనుకోకుండా అగ్గిపుల్లలు వెలిగించారు అవి అక్కడేవున్న చిత్తుకాగితాలు అంటుకుని అక్కడికక్కడే చిన్నారికి అంటుకున్నాయి చిన్నారి షేక్ హీన తీవ్రంగా గాయపడ్డారు గమనించిన టీచర్స్,పరిధిలోవున్న వ్యక్తులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైదశాలకు చికిత్స నిమిత్తం తరలించారు విషయం తెలుసుకున్న రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,సమితి నాయకులు కె.రాము హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించారు. చిన్నారి షేక్ హీనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు,అనంతరం బండిమెట్టలో గల స్కూల్ కు వెళ్లి అక్కడికివచ్చిన కర్నూలు యంఈవో అబ్దుల్ రహ్మాన్ మరియు స్కూల్ హెడ్మాష్టర్ జాన్సన్ లను అక్కడ జరిగిన సంఘటన పరిస్థితిని అడిగి తెలుసుకుని

స్కూల్ పరిసరాలలో ఇటువంటి సంఘటనలు బాధకరమని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పాఠశాల హెచ్.ఎం టీచర్స్,సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు సురేష్, గోపాల్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!