కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో సోమవారం బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా రాజవిహార్ సర్కిల్లోని అంబేద్కర్ భవన్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి నివాళులు అర్పించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.కే. రంగస్వామి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత మరియు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అని, సమాజంలోని ప్రతి ఒక్కరు వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీ లీల మాట్లాడుతూ హిందూ కోడ్ బిల్లు ద్వారా సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బీసీ తిరుపాల్ , పెద్దపాడు పుల్లన్న,నగర సంఘం ఉపాధ్యక్షుడు రాజు, కోశాధికారి కే. వెంకటేశ్వర్లు , ఉపాధ్యక్షులు ధనుంజయ, కోశాధికారి కే సి. నాగన్న, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు టీ. శ్రీలీల పాల్గొన్నారు.
Thanks for your feedback!