
పాడి పశువుల తొట్ల నిర్మాణానికి భూమి పూజ
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు
తుగ్గలి న్యూస్ వెలుగు; తుగ్గలి మండల పరిధిలోని గల పలు గ్రామపంచాయతీల యందు పాడి పశువుల త్రాగునీటి సంరక్షణ కొరకు తొట్ల నిర్మాణానికి టిడిపి నాయకులు భూమి పూజ చేశారు.మంగళవారం రోజున పత్తికొండ శాసనసభ్యులు శ్యాంబాబు ఆదేశాల మేరకు ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాడి పశువుల తొట్ల నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉపాధి హామీ సిబ్బంది మరియు అధికారుల ఆధ్వర్యంలో భూమి పూజను నిర్వహించారు.తుగ్గలి మండల పరిధిలోని గల రాంపురం గ్రామం నందు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పశువుల నీటి తోట్టి భూమి పూజ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వెంకట్రాముడు చౌదరి,గ్రామ సర్పంచ్ కమల్ భాష,భీమలింగప్ప,మల్లయ్య ఫీల్డ్ అసిస్టెంట్ ఇస్మాయిల్,గోవిందు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రామకొండ గ్రామం నందు పంచాయతీ కార్యదర్శి ముంతాజ్ బేగం పర్యవేక్షణలో ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు నీటి తొట్టికి భూమి పూజలు నిర్వహించారు. అదేవిధంగా రాంపల్లి గ్రామపంచాయతీ నందు పంచాయతీ కార్యదర్శి పులి రాజు పర్యవేక్షణలో ఫీల్డ్ అసిస్టెంట్ హేమాద్రి నాయుడు ఆధ్వర్యంలో మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు,మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు తదితర గ్రామ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో నీటి తొట్టేకు భూమి పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.