పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ బిల్లులు దగ్ధం

పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ బిల్లులు దగ్ధం

న్యూస్ వెలుగు, కర్నూలు క్రైం : రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని గురువారం సుందరయ్య సర్కిల్ లో సిపిఎం పార్టీ కర్నూలు న్యూసిటీ కమిటీ కార్యదర్శి టి.రాముడు అధ్యక్షతన విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్బంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.ఎస్.రాధాకృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు పి.నరసింహ,వై.నగేష్,నగర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్, సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపించుకున్న టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడవకముందే చార్జీల పేరుతో విద్యుత్ చార్జీల పేరుతో రూ.20వేల కోట్లు ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని మోపుతూ స్వర్ణాంధ్ర నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదగా ఉందని అన్నారు.గత రెండు నెలలుగా విద్యుత్ చార్జీల భారం భారీగా పెరిగిందని అన్నారు.వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను,ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి అదాని కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను ఎందుకు రద్దు చేయడం లేదని,టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కేంద్రంలో నరేంద్ర మోడీ,రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అదానీ భజన బృందాలుగా మారాయని విమర్శించారు.వెంటనే అదానితో చేసుకున్న విద్యుత్ పొందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్ మొహమ్మద్ రఫీ, ఎంసీ.ఆనంద్. అబ్దుల్లా . బతుకన్న,దస్తగిరి. అశోక్ గోపాల్,హుస్సేన్,కుమార్,శివ,చిన్న వ్యాపారస్తుల సంఘం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!