ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న టిడిపి నాయకులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.జొన్నగిరి, ఎర్రగుడి గ్రామాల నందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలుగుజాతి యొక్క కీర్తిని పెంపొందించడానికి ఆయన చేసిన సేవలు గురించి వారు కొనియాడారు.ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పత్తికొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్తికొండ శాసనసభ్యులు కేఈ శాంబాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు,ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకటపతి, మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, ఎర్రగుడి వెంకటస్వామి,ఎర్రగుడి చంద్రశేఖర్ యాదవ్,మిద్దె వెంకటేశ్వర్లు, విద్యా కమిటీ చైర్మన్ మిద్దె రవి,తెలుగు యువత మండల అధ్యక్షుడు సత్య ప్రకాష్,బీసీ సెల్ మండల అధ్యక్షుడు సంఘాల కృష్ణ,లక్ష్మణ స్వామి,మాజీ సర్పంచ్ బర్మా వీరేష్ తదితర టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానాన్ని చేశారు.