పల్నాడులో  విభిన్న ప్రతిభావంతుల సంబరాలు

పల్నాడులో విభిన్న ప్రతిభావంతుల సంబరాలు

పల్నాడు, న్యూస్ వెలుగు : ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “ఇంద్రధనస్సు” కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ జారీ చేసిన జీవోను స్వాగతించారు.
ఈ నిర్ణయానికి కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పల్నాడు జిల్లా విభిన్న ప్రతిభావంతుల తరఫున పాలాభిషేకం నిర్వహించారు.
కార్యక్రమంలో పల్నాడు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు వేముల బాలరాజు, అధికార ప్రతినిధులు షేక్ అల్లా నబి, సయ్యద్ సుభాని, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర కోశాధికారి కొల్లి శెట్టి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు ఏనుగంటి వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మల్లెల కోటేశ్వరరావు, కానాల గంగయ్య, ఎలమా సాంబశివరావు, రమణయ్య, రామకృష్ణ, వేణుగోపాల చారి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS