
ఏపీపీఎస్సీ పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అనుమతి లేదు
అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ
కర్నూలు, న్యూస్ వెలుగు: పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అనుమతించబడని డిఆర్ఓ సి. వెంకటనారాయణమ్మ తెలియజేశారు.గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, సమీక్షా సమావేశంను నిర్వహించారు. డిఆర్ఓ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అనుమతించబడవని అన్నారు.
ఈనెల 23 వ తేదీన ఏపీపీఎస్సీ గ్రూప్- 2 పరీక్షలు ఆదివారం ఉదయం 10:00 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్నారు. అభ్యర్థులు ఉదయం 09:30 గంటల వరకు గ్రేస్ పీరియడ్ తో కలిపి 9.45 గంటల వరకు అనుమతించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3.00గంటల నుండి సాయంత్రం 5.30 వరకు నిర్వహించడం జరుగుతుందని మధ్యాహ్నం 2.30 వరకు 15 నిమిషాలు గ్రేస్ పిరియడ్ అంటే 2.45 గంటల వరకు అనుమతించనున్నట్లు తెలిపారు.
హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని అన్నారు.జిల్లాలో 30 కేంద్రాలలో 9993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నరన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, మొదలైనవి) తీసుకురావాలన్నారు.పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు కల్పించామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 08518-277305, ఉదయం 10 గంటలనుండి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటుందని, సందేహాలు ఉంటే సంప్రదించాలని కోరారు. ఏపీపీఎస్సీ డిప్యూటీ సెక్రటరీ కుమార్ రాజు, మాట్లాడుతూ ప్రతి అభ్యర్థి ప్రశ్నపత్రం సీరిస్ ను వ్రాసి OMR జవాబు పత్రంలో మాత్రమే బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో నిర్దేశించిన ప్రదేశములు సర్కిల్ ను బబుల్ చేసేలా చూసుకోవాలన్నారు. ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత ఇన్విజిలేటర్స్ జవాబు పత్రాలను జాగ్రత్తగా సీల్ చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ డిఎస్పి బాబు ప్రసాద్, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వి బాబురావు సెక్షన్ ఆఫీసర్లు బ్రహ్మేశ్వర రావు, కే. సుధాకర్ బాబు, ఏ ఎస్ ఓ లు కెఎస్ఎస్ అనిల్ కుమార్, టి ఆంజనేయులు, ఏ యోగేష్ తదితరులు పాల్గొన్నారు.