అబ్దుల్లాపురంలో ఘనంగా తితిదే ధార్మిక కార్యక్రమాలు

అబ్దుల్లాపురంలో ఘనంగా తితిదే ధార్మిక కార్యక్రమాలు

నిత్యతృప్తదాస్ జీ ఇస్కాన్ ధర్మ ప్రచారకులు

నంద్యాల, న్యూస్ వెలుగు;  భగవంతునిపై అపారమైన భక్తి, నమ్మకంతో పాటు, సర్వభూతములపై దయకలిగి ఉండడం భగవంతునికి దగ్గరయ్యే మార్గాలని, ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్ జీ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, వెలుగోడు మండలం, అబ్దుల్లా పురం గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిశాయి. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం కార్యక్రమాలు ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యులు ఉదారు రామలింగేశ్వర రెడ్డి, ఎన్.వెంగళ రెడ్డి, రఘుస్వామి రెడ్డి, ఎ.శివశంకర రెడ్డి, వి.బాలసంజీవ రెడ్డి, రామకృష్ణ, ఎన్.నాగలక్ష్మీ, వి.లింగమ్మ, సుబ్బమ్మ, పి. సరస్వతమ్మ, ఉదారు సుభద్రమ్మ, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!