FlatNews Buy Now

ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన ముఖ్యమంత్రి

అమరావతి (న్యూస్ వెలుగు ): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం  ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు నవంబరు 1వ తేదీ నుంచి 1 డీఎ చెల్లించాలని నిర్ణయించారు. పోలీసులకు 2 విడతల్లో సరెండర్ లీవ్ క్లియర్ చేయనున్నట్లు తెలిపారు . 60 రోజుల్లోగా వ్యవస్థలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి రియల్ టైమ్ లో ఆరోగ్య పరమైన ఖర్చులు చెల్లిస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేసేలా కీలక సూచనలు చేసినట్లు వెల్లడించారు. 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెసిగ్నేట్ చేస్తామన్నారు .180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఇది అందరి ప్రభుత్వమని సిఎం బరోసను అందించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS