వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

అమరావతి (న్యూస్ వెలుగు ):  ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు బుదవారం  సచివాలయంలో ఆవిష్కరించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనల స్ఫూర్తితోనే 2018లో ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ పురుడు పోసుకుందని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చెప్పారు. నాటి నుంచి ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి తరుపున పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. అమరావతి ప్రెస్ క్లబ్ ద్వారా రాజధానిలో మీడియా తన వంతు పాత్ర పోషించాలనేది తమ ఆకాంక్షగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అప్పాజీ, జనరల్ సెక్రటరీ సతీష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, ట్రెజరర్ కె.పూర్ణచంద్రరావు, జాయింట్ సెక్రటరీ మహేష్, కమిటీ సభ్యులు శ్యామ్ సుందర్, మల్లేశ్వరరావు, శ్రీనివాస్, కె.గాంధీబాబు, అనిల్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS