
సీఐఐ భాగస్వామ్య సదస్సు పై ముఖ్యమంత్రి సమీక్ష
ఏపి సచివాలయం (న్యూస్ వెలుగు ): విశాఖపట్నం లో నవంబరు 14,15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలసీమేకర్లను కూడా ఆహ్వానించాలని సీఎం కోరారు. కేవలం రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే కాకుండా నాలెడ్జి షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ లాంటి రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు సదస్సును వేదిక చేయాలని అభిప్రాయపడ్డారు.
Was this helpful?
Thanks for your feedback!