ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఉపశమనం
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరట కలిగిస్తుందని సోమవారం ఒంటిమిట్ట మండలం నర్వకాటి పల్లె పంచాయతీ ఆ గ్రామంలోనీ సహాయ నిధిని దరఖాస్తు చేసుకున్న జంధ్యం. కృష్ణవేణి అనే బాధితురాలికి తెలుగుదేశం పార్టీ రాజంపేట ఇన్చార్జ్ సుగవాస. బాలసుబ్రమణ్యం చెక్కును అందిస్తూ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించడం కోసం ఆ గ్రామానికి రావడం జరిగింది. స్థానిక నాయకులు ఆయనకు ఆహ్వానం పలికారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం నరవకాటిపల్లి పంచాయతీ నరవకాటపల్లి గ్రామానికి చెందిన జంధ్యం. కృష్ణ వేణి అనే బాధితురాలు ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం గత కొద్ది కాలంగా రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ మేరకు బాధితురాలికి 30,028/ రూపాయల సహాయ నిధిని ప్రభుత్వం కేటాయించింది. సహాయ నిధి చెక్కును రాజంపేట ఇన్చార్జ్ సుగవాసి. బాలసుబ్రమణ్యం బాధితురాలికి స్వయంగా అందించాడు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి బాధితులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఏ ఒక్కరికైనను న్యాయం జరగలేదని ఎవరికి సహాయనిది అందించలేదని అవకతవకల ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజల్లో చెడ్డ పేరు సంపాదించుకుందని, ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హత కలిగిన బాధితులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే తక్షణమే న్యాయం జరుగుతుందని పేద ప్రజల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నాడని తెలుగుదేశం హయాంలో రాష్ట్ర ప్రజలకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారన్నాడు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైనా సరే సీఎం సహాయ నిధికి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.