
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర వికాసము శిక్షణ కార్యక్రమం
న్యూస్ వెలుగు, కర్నూలు; మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయిలో కిషోర్ వికాసం పై శిక్షణ కార్యక్రమమును స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ సాధికారిక అధికారి పి వెంకట లక్ష్మమ్మ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం, ముఖ్యఅతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య హాజరవడం ముందుగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించడం సందర్భంగా శిక్షకులకు కిశోర వికాసం పై అవగాహన కలిగిస్తూ ముఖ్యంగా అడల్సన్స్ ఏజ్ లో వచ్చే హెల్త్ , న్యూట్రి
షన్ మెన్సురేషన్ మొదలైన అంశాలపై అవగాహన కల్పించడం గ్రామస్థాయిలో వెళ్లాలంటే ఈ శిక్షకులు మండల స్థాయిలో ఎదుర్కొంటున్న కిషోర్ బాలికలు ఎదుర్కొంటున్న బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక దాడులు వేధింపులు మొదలైన వాటిపై అవగాహన కల్పించినప్పుడే ఈ శిక్షణ కార్యక్రమం కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం అనేది నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం బాల బాలికలకు సంబంధించిన అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ పోస్టర్ను ఇనాగ్రేషన్ చేయడం జరిగినది అనంతరము బాల్య వివాహ విముక్తి పై ప్రతిజ్ఞ చేయించడం జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన స్టేట్ రిసోర్స్ సభ్యులు పౌష్టికాహారము ఆరోగ్యము పరిశుభ్రత రుతు శ్రావము బాల్య వివాహాలు బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు వేధింపులు మొదలైన అంశాలపై శిక్షణ డిఆర్డిఏ ఐసిడిఎస్ మున్సిపాలిటీ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఆర్కే ఎస్కే , ఎన్జీవో ప్రతినిధులు , జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ మరియు సభ్యులు మరియు మెప్మా తదితర శాఖలకు సంబంధించిన దాదాపు 200 మంది పైగా శిక్షకులు పాల్గొన్నారు.