
గడ్డి వాము దగ్ధం స్థలాన్ని పరిశీలించిన సిఐ
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని హెబ్బటం గ్రామంలో శుక్రవారం గడ్డివాములు దగ్ధమైన విషయం తెలుసుకున్న ఆలూరు సిఐ వెంకట చలపతి శనివారం సంఘటన స్థలానికి చేరుకొని గడ్డివాములు కాలిపోవడానికి గల కారణాల గురించి గ్రామ ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఆలూరు సిఐ వెంట ఫైర్ ఆఫీసర్ ఎస్ ఎండి ఖాద్రి,ఎస్ఐ బాల నరసింహులు,ట్రైనీ ఎస్ఐ,పోలీస్ సిబ్బంది ఉన్నారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా అందరూ కలిసి మెలిసి అన్నదమ్ములుగా ఉండాలని సూచించారు.కార్యక్రమంలో గ్రామస్థులు పెద్దలు నరసప్ప,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda