మీ అందరి కృషి ఫలితమే క్లస్టర్ యూనివర్సిటీ

మీ అందరి కృషి ఫలితమే క్లస్టర్ యూనివర్సిటీ

         వీసీ ఆచార్య డివిఆర్ సాయి గోపాల్

కర్నూలు, న్యూస్ వెలుగు; మీ అందరి కృషి ఫలితమే క్లస్టర్ యూనివర్సిటీ అభివృద్ధి అని వీసి ఆచార్య డివిఆర్ సాయి గోపాల్ పేర్కొన్నారు. మంగళవారం వీసీ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య డివిఆర్ సాయి గోపాల్ మాట్లాడుతూ క్లస్టర్ యూనివర్సిటీ అభివృద్ధిలో మొదటి యూనివర్సిటీగా నేను భాగస్వామి కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని ఈ యూనివర్సిటీ రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంగా భవిష్యత్తులో వెలుగొందుతుందని ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు.
అదే విధంగా వీసీ నాలో నేను అనే తన ఆత్మకథ బుక్కును సభలో ఆవిష్కరించారు. అనేసభాధ్యక్షులు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి వి ఎస్ కుమార్ మాట్లాడుతూ క్లస్టర్ యూనివర్సిటీకి మొదటి వీసీ పరిపాలనపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి వీసీగా రావడం వలన క్లస్టర్ యూనివర్సిటీ ఇంత అభివృద్ధి చెందిందని ఇది అంతా సార్ కి మంచి చేయాలనే ఆలోచన అని అన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్లస్టర్ యూనివర్సిటీ దినదిన అభివృద్ధి చెందుతుండడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్లస్టర్ యూనివర్సిటీలో ఎంతో నిపుణులైన అధ్యాపకులు ఉండడం ఇక్కడ విద్యార్థులకు ఒక వరంగా ఉపయోగపడుతుందన్నారు.
మాజీ రిజిస్ట్రార్ ఆచార్య శ్రీనివాసులు మాట్లాడుతూ అందరి సహకారంతో క్లస్టర్ యూనివర్సిటీని తమ వంతు అభివృద్ధి చేశామని అన్నారు. రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి విజయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ క్లస్టర్ యూనివర్సిటీ ఒక మంచి విద్యాలయంగా భవిష్యత్తులో వెలుగొందుతుందని అన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా శాంతి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే ఒక విద్యాలయంగా వెలుగొందుతున్న క్లస్టర్ యూనివర్సిటీ అధ్యాపకులు అయినందుకు మేము గర్విస్తున్నామని అన్నారు. చంద్రశేఖర్ (kalkura) మాట్లాడుతూ గతంలో పీజీ చదవాలంటే మద్రాస్, తిరుపతి వెళ్లే వారిని ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో నాలుగు యూనివర్సిటీలు ఉండడం ఇక్కడ విద్యార్థులు ఎంతో అదృష్టం చేసుకున్నారన్నారు.
జెఎస్ఆర్కే ఒక కవిత చదివి వినిపించారు. ఎలపర్తి రమణయ్య డివిఆర్ సాయి గోపాల్ జీవిత కథ కవిత రూపంలో చదివి వినిపించారు. సమావేశంలో చాలా మంది అధ్యాపకులు మాట్లాడారు.
వీసీ ఆచార్య డివిఆర్ సాయి గోపాల్,ఆయన సతీమణి వాసంతి లను క్లస్టర్ యూనివర్సిటీ అధ్యాపకులు, రిజిస్ట్రార్ లు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీల వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ బి.ఆర్ ప్రసాద్ రెడ్డి,డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ దేవికారాణి, అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!