
ముగిసిన రెవిన్యూ సదస్సు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో బుధవారం పెద్దహ్యాట గ్రామంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయి.సర్పంచ్
హేసనులా అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా రైతుల భూ సమస్యలతో కూడిన 3 అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసుగు చెందాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తమ వద్దకే అధికారులను పంపి సమస్యలు తెలుసుకునేలా చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శివన్న,రీ సర్వే తహసీల్దార్ ముంకుద రావు,వీఆర్వో ప్రహ్లాద,దామోదర్,కంప్యూటర్ ఆపరేటర్ బసవ,గ్రామ సర్వేయర్లు,గ్రామ సేవకులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!