డీలర్లు నాణ్యమైన ఉత్పత్తులను విక్రయించాలి

డీలర్లు నాణ్యమైన ఉత్పత్తులను విక్రయించాలి

ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలము లోని ఉప్పలూరు గ్రామంలో ఎరువులు,విత్తనాలు,పురుగు మందుల దుకాణాలను పరిశీలించి విత్తన నమూనాలు సేకరించి నాణ్యత ప్రమాణాల పరిశీలన నిమిత్తము ప్రయోగశాలకు పంపించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ప్రతీ నెల నమూనాలు సేకరించి ఆయా ప్రయోగశాలలకు పరిశీలనా నిమిత్తం పంపడం జరుగుతుంది అని తెలిపారు.డీలర్లు నాణ్యమైన ఉత్పత్తులు, అనుమతి కలిగిన వాటిని మాత్రమే రైతులకు విక్రయించాలని కోరారు.అనామక ఉత్పత్తులు విక్రయించరాదు అని సూచించారు.అలాగే స్టాక్ బోర్డ్ ,స్టాక్ రిజిస్టర్లు ప్రతి రోజు రాసి ఉంచాలని కోరారు.లైసెన్స్ కనపడేలా దుకాణం లో ఉంచాలని కోరారు.అమ్మిన ప్రతి రైతుకి నగదు బిల్లు ఇవ్వాలని కోరారు.వ్యవసాయ శాఖ ఆదేశాల ప్రకారం వ్యాపార లావాదేవీలు కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!