పేదలకు పట్టాలు ఇవ్వాలి 

 పేదలకు పట్టాలు ఇవ్వాలి 

బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇల్లు స్థలాలు ఇవ్వాలి 

ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలి 

హోళగుంద, న్యూస్ వెలుగు;  మండలం సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టి తాసిల్దార్ సతీష్ గారికి పెద్దహ్యాట గ్రామ సదస్సులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపుమేరకు సిపిఐ మండల కార్యదర్శి పెద్దహ్యాట B.మారెప్ప మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాచంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఇల్లు స్థలాలు ఇస్తామని అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హామీలు నేర్చుకోవాలని సిపిఐ కోరుతున్నాము
అలాగే మండల కేంద్రమైన హోళగుందలో ఈబీసీ కాలినినందు 2004 నుంచి భూ పోరాటం చేసి అక్కడ నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిచాలని ఇల్లు పట్టాలని మంజూరు చేయాలనీ తాసిల్దార్ సతీష్ కుమార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందిఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు కృష్ణయ్య ఏఐటీయూసీ మండల కార్యదర్శి రంగన్న సిపిఐ నాయకులు వెంకన్న యూసుఫ్ సలాం సాబ్ అమీర్ మహిళా సంఘం నాయకురాలు భూలక్ష్మి వనిజమ్మ మీనాక్షి బసమ్మ జాజిదమ్మ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!