కర్నూలు, న్యూస్ వెలుగు; శనివారం ఉదయం ప్రమాదావశాత్తు మృతి చెందిన ఎస్ యం కే వి ఉన్నత పాఠశాల, విద్యా నగర్ , మంత్రాలయం మండలం చెందిన 10వ తరగతి బాలిక జి .అనూష మృతదేహానికి ఎమ్మిగనూరు ప్రభుత్వ

ఆసుపత్రి వద్ద జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. 10వ తరగతి పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థిని ప్రమాదవశాత్తు మరణించడం దురదృష్టకరమైన పరిణామమని దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. డిఈఓ శ్యామ్యూల్ పాల్ సంఘటన తెలుసుకొని ఉన్నపాటున ఎమ్మిగనూరు వెళ్లి తల్లి తండ్రులను కలసి ఓదార్చి , వారి శోక సంద్రంలో తను కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. బాలిక తండ్రికి అంత్యక్రియల నిమిత్తం వ్యక్తిగతంగా 10వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి తండ్రిని ఓదార్చారు. ఆవేదన పూడ్చలేనిదన్నారు. తమ పిల్లలు చదువుకునేందుకు బస్ సౌకర్యం కల్పించాలని చౌటుపల్లి, సుంకేశ్వరీ గ్రామప్రజలు కోరారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇచ్చారు.
Thanks for your feedback!