రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు డిపాల్ స్కూల్ విద్యార్థులు
ఆత్మకూర్, న్యూస్ వెలుగు; స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 విభాగంలో బాక్సింగ్ పోటీలకు డిపాల్ పాఠశాల విద్యార్థులు యుగంధర్, మోహన్ కృష్ణ సాయి ఎంపికైనట్లు డిపాల్ ప్రిన్సిపాల్ ఫాదర్ షిన్స్ మరియు వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ వినీత్ గారు తెలిపారు. ఈ సందర్భంగా ఫాదర్స్ మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ -14 విభాగంలో జరిగిన జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు అని తెలిపారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మచిలీపట్నం లో జరిగే రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన యుగంధర్, మోహన్ కృష్ణ సాయి ఫాదర్స్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని ఆశ భవాన్ని వ్యక్తం చేశారు.
Was this helpful?
Thanks for your feedback!