విచారం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి

విచారం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి

న్యూస్ వెలుగు  మంగళగిరి :

విరవ గ్రామంలో ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   విచారం పిఠాపురం నియోజకవర్గంలోని విరవ గ్రామంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారని తెలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆటో, వ్యాన్ ఢీ కొన్న ప్రమాదంపై జిల్లా అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి, ఆ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకునే చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. బాధితులకు సహాయం అందించడంలో తగిన విధంగా సమన్వయం చేసుకోవాలని తన కార్యాలయ అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!