
సైకిల్ ఎక్కిన ఉప ముఖ్యమంత్రి
న్యూస్ వెలుగు అమరావతి : విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రాజాపు సిద్ధూ అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించడం తో ఉప ముఖ్యమంతి పవన్ కళ్యాణ్ అభినందిచారు . సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధూ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్ధూ రూపొందించిన సైకిల్‌ను స్వయంగా నడిపి తన ఆవిష్కరణలను పరిశీలించినట్లు తెలిపారు. అతని ఆలోచనలను మెచ్చుకుని భవిష్యత్తులో సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలన్నారు. అనంతరం సిద్డుకి లక్ష రూపాయలు అందించారు. అంతేకాకుండా సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టి స్వయంగా నడిపారు. విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ, కాలేజీకి వెళ్లేందుకు మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం గల ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను స్వయంగా తయారు చేశాడు. ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.