
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి
విజయవాడ, న్యూస్ వెలుగు; దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో బుధవారం మహమండపం ఆరోవ అంతస్తులో ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డిప్యూటీ ఈవో ఎం.రత్న రాజు, ఈ ఈ లు కె వి ఎస్ కోటేశ్వర రావు, టి. వైకుంఠ రావు లు , వైదిక కమి
కళశ జ్యోతులు –
ఈ సందర్బంగా కళశ జ్యోతులు గురించి సమీక్షిస్తూ ఈ నెల 14 న సాయంత్రం 6 గం. లకు శివరామ నామ క్షేత్రం నందు చేయవలసిన పూజాది ఏర్పాట్లు, అమ్మవారి రధం నందు అలంకరణ, లైటింగ్, సౌండు తదితర ఏర్పాట్లు, రూట్ మాప్ నందు ట్రాఫిక్ ఇబ్బందులు, కరెంట్ తీగలు లేకుండా జాగ్రత్తలు, అగ్ని మాపక శాఖ, మునిసిపల్, ఎలక్ట్రిసిటీ, పోలీస్, బందోబస్త్, అత్యవసర వైద్య సదుపాయం, సంబంధిత అధికారుల సమన్వయంతో త్రాగు నీరు, ప్రసాదం పంపిణీ, సెక్యూరిటీ, కౌంటింగ్. సిసి టివి కెమెరాల నిర్వహణ, టాయిలెట్లు, శానిటేషన్ ఏర్పాట్లు పటిష్టముగా ఉండాలని, రద్దీ క్రమబద్దీకరణ, భక్తులకు సూచనలు తదితర అవసరముల నిమిత్తం ఎప్పటికప్పుడు అన్ని చోట్ల వినపడేలా అనౌన్స్మెంట్, హ్యాండ్ మైక్ లు ఏర్పాటు, కమ్మునికేషన్ నిమిత్తం సెట్ లు ఏర్పాటు, జ్యోతులు సమర్పించిన వారు అమ్మవారి దర్శనం నకు, తిరిగి వెళ్ళు వారికి ఎగ్జిట్ ఏర్పాట్లు చేసి, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు, స్వయం సేవకుల సహాయ సహకారాలను వినియోగించుకొని
ఎక్కడా ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు.
భవాణీ దీక్షా విరమణలు :
డిసెంబర్ 21 నుండి 25 వరకు జరుగు భవాణీ దీక్షా విరమణల గురించి చర్చిస్తూ, భక్తితో ఎక్కడెక్కడి నుండో అత్యంత భక్తి భావం తో విచ్చేసే అమ్మవారి భక్తులకు గత సంవత్సరపు అనుభవములను సమీక్షించుకొని ఈ సంవత్సరం మెరుగైన సౌకర్యాలు కల్పన చేయాలని, క్యూ లైన్ లు, షెడ్లు, లైటింగ్, సౌండ్ ఏర్పాట్లు, ఇరుముడి విరమణ పాయింట్లు వద్ద స్టాండ్ లు ఏర్పాటు మరియు నిర్వహణ,
కొబ్బరి కాయలు కొట్టు ప్రదేశం,
హోమ గుండములు నిర్వహణ, ప్రతి చోట సూచిక బోర్డుల ఏర్పాటు,
త్రాగు నీరు ఏర్పాట్లు, అదనపు సిబ్బంది, ప్రసాదం, కల్యాణకట్ట తదితర కౌంటర్లు, తాత్కాలిక లైటింగ్, బ్యారికేడ్లు, షెడ్ లు, పబ్లిక్ అనౌన్స్ మెంట్, గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు గురించి సమీక్షించి, సదరు రోజులలో భక్తులందరికీ దర్శనం ఉచితమని, అంతరాలయం, దర్శన టిక్కెట్లు ఉండవని, ఆర్జిత సేవలు నిలుపుదల చేయడమైనదని, అన్ని లైన్ లు ఉచితమని,
డిసెంబర్ 21 న ఉదయం 06.30 గం. లకు అమ్మవారి దర్శనం ప్రారంభమగునని,
మిగిలిన రోజుల్లో (డిసెంబర్ 22 నుండి 25 వరకు) ఉదయం 3 నుండి రాత్రి 11 గం. ల వరకు అమ్మవారి దర్శనమిచ్చేదరిని ఈవో తెలిపారు.