లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కొరకు  ధర్మప్రచారం

లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కొరకు  ధర్మప్రచారం

విజయవాడ, న్యూస్ వెలుగు; పౌర్ణమి సందర్భముగా ఉదయం లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కొరకు  ధర్మప్రచారం నిమిత్తం వేదపండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం(ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి, అమ్మవార్లుకు ఆలయ వైదిక సిబ్బందిచే బుధవారం  ఉ.05.55 గం. ల సమయంలో శాస్త్రోక్తముగా పూజలు నిర్విహించి, ఆలయ ఈవో కె ఎస్ రామరావు కొబ్బరి కాయ కొట్టి గిరిప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషముగా పాల్గొన్నారు.
గిరిప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయము, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమముల నడుమ తిరిగి ఆలయమునకు చేరుకున్నారు. గిరిప్రదక్షిణ మార్గము నందు భక్తులు ప్రచార రథము లో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయ లు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.

Author

Was this helpful?

Thanks for your feedback!