కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రభుత్వ అనుమతి లేకుండా కొంతమంది ప్రవేట్ వ్యక్తులు నడుపుతున్న డయాగ్నొస్టిక్ సెంటర్లను సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు బి నాగరాజు అధ్యక్షత వహించగా పాల్గొన్న ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, నగర కార్యదర్శి బిసన్న మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో చాలామంది ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అర్హత లేనటువంటి వ్యక్తులు డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వీటి పైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి పలుమార్లు , జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్లు మారిపోతున్నారు తప్ప అనుమతి లేని డయాగ్నొస్టిక్ సెంటర్ లపై చర్యలు తీసుకోలేకపోవడంతో వాటి యాజమాన్యాలు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో ప్రవేశించి అమాయక ప్రజలు వార్డు నుండి బెడ్ శాంపిల్ తీసుకొని కనబడితే చాలు మాయమాటలు చెప్పి వారి ల్యాబ్ లోకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నప్పటికీ వైద్య పరీక్షలో నాణ్యత లేకపోవడంతో డాక్టర్లు మరల వైద్య పరీక్షలు రాస్తున్నారని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే అమాయక ప్రజలు వైద్య పరీక్షల కోసం అధిక వ్యయం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు , జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ అనుమతి లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్లను వెంటనే సీజ్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని లేనిపక్షంలో ఏఐవైఎఫ్ ప్రభుత్వ అనుమతి లేని డయాగ్నొస్టిక్ సెంటర్లను పైన ప్రత్యక్ష దాడులు చేస్తామని వారు హెచ్చరించారు , అదేవిధంగా కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్స్ విచ్చలవిడిగా ఫీజులు దోపిడి చేస్తున్నాయని అలాంటి వాటిలో కూడా ఫీజుల అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర నాయకులు చంటి, కృష్ణ , శ్రీకాంత్, అఖిల్,సూర్య మధు, శ్రీను, శివుడు, ప్రభాకర్, బద్రి, శివ, శివాజీ, రాజశేఖర్, సయ్యద్, హసన్, తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!