మండలంలో వృద్ధాప్య పింఛన్ పంపిణీ
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు: కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమి ట్ట మండలంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవ్వ తాతల పింఛన్ శుక్రవారం ఉదయం మండల టిడిపి నాయకుల ,పంచాయితీ సిబ్బంది ఆధ్వర్యంలో ఎంపీడీవో సోమశేఖర్ పంపిణీ చేయడం జరిగింది. ఎన్డీఏ నేతలు పింఛన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధి దారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఒంటిమిట్ట మండలంలో 13 పంచాయితీల్లో పంచాయతీ సిబ్బందితో కలిసి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మండలంలోని పంచాయితీల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్ డి ఏ కూటమి ఏర్పడిన కొద్దినాలలోనే చెప్పిన విధంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తూ ప్రజాదరణ పొందిందని ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో రాష్ట్రము ముందంజలో ఉంటుందని భవిష్యత్తులో రాష్ట్రము ఎంతో పురోగతి సాధిస్తుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట పంచాయతీ సెక్రెటరీ సుధాకర్, నర్వకాటి పల్లె పంచాయతీ సెక్రెటరీ చంద్ర, కొత్త మాధవరం, పెన్న పేరూరు పంచాయతీ సెక్రటరీలు నాగ సుబ్బారెడ్డి ,భావన, తదితర సిబ్బంది మండల స్థాయి టిడిపి నాయకులు, పించన్దారులు తదితరులు పాల్గొన్నారు.