చిన్నారులకు ఆర్థిక సహాయం కొరకు ముందుకొస్తున్న దాతలు

చిన్నారులకు ఆర్థిక సహాయం కొరకు ముందుకొస్తున్న దాతలు

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం మారెళ్ళ గ్రామంలో గత కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులకు ఆర్థిక సహాయం అందించడానికి దాతలు ముందుకొస్తున్నారు.ఈ ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులు లేక అనాధలుగా మిగలడంతో పిల్లలకు అండగా పలువురు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు.తల్లిదండ్రులు లేక అనాధ లేనా పిల్లలకు సహాయం చేయాలని ఉద్దేశంతో చక్రాల గ్రామానికి చెందిన రవి ఇంస్టాగ్రామ్ గ్రామ ద్వారా పిల్లలకు సహాయం చేయమని వీడియో చేయడం జరిగింది.వీడియోస్ ను చూసి స్నేహితులు మరియు దాతలు 51,100 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా టమోటా వ్యాపారస్తులు 5000,పెండెకల్ మెడికల్ రెప్స్ 5000, ప్యాపిలికబడ్డీ టీమ్ హంటర్ 8000, ఆర్ఆర్ బ్రదర్స్ 5000 రూపాయలను అనాధ అయినటువంటి పిల్లలకు అందజేసే అండగా నిలిచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామం నుండి ఈ విధంగానే స్పందించాలని ఈ చిన్నారులకు అండగా నిలిచాలని తల్లిదండ్రులు లేని లోటు తీర్చాలని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నట్లు దాతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మారెళ్ళ వాల్మీకి అంజి,హోసూర్ రామచంద్ర,మీసేవ రాముడు,దేవరింటి వెంకటరాముడు,గొల్ల రామయ్య, మద్దిలేటి,చందోలి మాజీ సర్పంచు రంగప్ప,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ అనాధ పిల్లలకు సహాయం అందించే వాళ్ళు 9949081540 ఈ నెంబర్ ద్వారా సమాచారం తీసుకుని గ్రామానికి వచ్చి చిన్నారులకు ఆర్థికంగా అన్ని విధాలుగా సహాయం చేస్తారని వారు తెలియజేసారు.

Author

Was this helpful?

Thanks for your feedback!