
రాజకీయ నాయకుల పోరులో పేద విద్యార్థుల జీవితాలతో చలగాటాలు వద్దు
ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంజిత్ కుమార్, చిన్న, డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానంతరం ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంజిత్ కుమార్ చిన్న మాట్లాడుతూ 2019లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ పేద, బడుగు, బలహీన ,వర్గాల విద్యార్థులకుక ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను దాదాపు 4 వేల కోట్లను పెండింగ్లో పెట్టి ఈరోజు వాళ్ళ లబ్దికోసం ఫీజు పోరు అనేటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అయితే గత 2019 నుండి 2024 దాకా జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, లాంటి పథకాలను తీసుకొచ్చినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం మొదటి విడత మాత్రమే స్కాలర్షిప్లను ఇచ్చి మిగిలిన బకాయిలు మొత్తం పెండింగ్లో ఉంచినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది కాదా? అని వారు విమర్శించారు. 2009లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారని పదేపదే జగన్మోహన్ రెడ్డి నోటి వెంట వచ్చిన మాటలు వాళ్ళ నాన్న తీసుకొచ్చినటువంటి స్కాలర్షిప్ పథకాలకు తూట్లు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కాదా? అధికారంలోకి వచ్చిన తర్వాత స్కాలర్షిప్ పథకాలను పూర్తిస్థాయిలో పెండింగ్లో ఉంచి కేవలం ఇళ్లల్లో ఒకరికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తిస్తుందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాదా? అని విమర్శించారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు నెంబర్స్మెంటు, స్కాలర్షిప్ పథకాన్ని పూర్తిస్థాయిలో అందజేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని ఎన్నో ప్రగాల్పాలు పలికినటువంటి నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు గాని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గడిచిన తొమ్మిది నెలలో 780 కోట్లు రూపాయలను ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇచ్చామని గొప్పలు చెప్పినప్పటికీ ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విద్యార్థుల అకౌంట్లో గాని, ఆయా కళాశాలల అకౌంట్లో నేటికీ చేరలేదు. చెప్పడంలో మాత్రమే గొప్పలు చూపిస్తున్నటువంటి నేటి ప్రభుత్వం ఇప్పటికీ ఫీజు రాబర్స్మెంట్ ,విడుదల చేయకపోవడం చాలా దారుణం. చట్టసభల్లో ప్రజలను, విద్యార్థులను మోసం చేసే విధంగా ఫీజు రాబర్స్మెంట్ స్కాలర్షిప్ ను ఇచ్చామని గొప్పలు చెప్తున్నప్పటికీ నేటికీ ఫీజు మెంబర్స్ మెంట్, స్కాలర్షిప్ రాక విద్యార్థులు మగ్గిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల పోరులో పేద విద్యార్థి జీవితాలను బలి చేయొద్దు అని వారు విమర్శించారు. కాబట్టి తక్షణమే ఫీజు రిమెంబర్స్ మెంట్, స్కాలర్షిప్ ను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని హెచ్చరించారు. లేని పక్షాన విద్యార్థి ఉద్యమాలకు శ్రీకారం చుట్టుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణు. నాయకులు రవి, బాలు, శ్రీధర్, విమల, సరోజ, వాణి, తదితరులు పాల్గొన్నారు.