బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణం విజ్ఞాన్ స్కూల్ ఆవరణం లొ అంబేద్కర్ చిత్రపటానికి బడుగు బలహీనర్గాల, చేనేతలు మైనారిటీ సోదరులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్(లేపాక్షి) మాజీ చైర్ పర్సన్ శ్రీమతి బడిగించల విజయలక్ష్మి మరియు *బడిగించల చంద్రమౌళి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.ఈ కార్యక్రమం లో చేనేత నాయకులు కంభం చిన్న రామమూర్తి, సిలివెరి శివ, బడిగించల నరసింహులు, భాష,పలువురు ప్రజా సంఘాల నాయకులు, విశ్వబ్రాహ్మణ నాయకులు దస్తగిరి ఆచారి,పలువురు మైనారిటీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు.