
పేద ప్రజల భవిష్యత్తు కోసం కృషిచేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్
తుగ్గలి ఎంపీపీ ఆర్.రామాంజినమ్మ
తుగ్గలి న్యూస్ వెలుగు : పేద ప్రజల భవిష్యత్తు కోసం కృషిచేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆని తుగ్గలి ఎంపీపీ ఆర్.రామాంజనమ్మ అన్నారు.శనివారం ఎంపీడీవో కార్యాలయంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలను ఎంపీపీ ఆర్ రామాంజనమ్మ వేసి నివాళులర్పించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో దేశానికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో శభాష్పురం గ్రామపంచాయతీ సర్పంచ్ గౌరవ సలహాదారుడు గూటుపల్లె రవి, జూనియర్ అసిస్టెంట్ రామబ్రహ్మం, అదేవిధంగా తుగ్గలి తహసిల్దార్ కార్యాలయం నందు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు,వీఆర్వో తిమ్మయ్య లు బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది,ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.