కప్పట్రాళ్ళ గ్రామంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్లు ఆవిష్కరణ చేసిన ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ
కర్నూలు, న్యూస్ వెలుగు; కప్పట్రాళ్ళ గ్రామం ప్రపంచ స్ధాయిలో మొదటి స్ధానం లో నిలవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి…గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలి.దేవనకొండ మండలం, కప్పట్రాళ్ళ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలలో ” మెగా టీచర్స్ పేరెంట్ ” మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈగల్ ఐజి , కర్నూలు జిల్లా ఎస్పీ . డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే మన లక్ష్యం… సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారద్రోలుదాం.
• డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1972 నెంబరుకు తెలియజేయండి.
• డ్రగ్స్ అనర్థాలపై అవగాహన తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని, సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారద్రోలుదామని ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ ఐపియస్, కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ పిలుపునిచ్చారు.
శనివారం దేవనకొండ మండలం , కప్పట్రాళ్ళ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో ” మెగా టీచర్స్ పేరెంట్ ” మీటింగ్ నిర్వహించారు.
ఈగల్ ఐజి , కర్నూలు జిల్లా ఎస్పీ, ఈగల్ ఎస్పీ లు ముఖ్య అతిథిగా పాల్గొని ” డ్రగ్స్ వద్దు బ్రో ” అనే కార్యక్రమం పై అవగాహన చేశారు.
ఈసందర్భంగా ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ మెగా టీచర్స్ పేరెంట్ ” మీటింగ్ కార్యక్రమాన్ని ఈ రోజు 40 వేల పాఠశాలలో చేస్తుందన్నారు. సుమారు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు.కప్పట్రాళ్ళ గ్రామం ప్రపంచ స్ధాయిలో మొదటి స్ధానంలో నిలవాలన్నారు. గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలంటే పిల్లల తోనే సాధ్యమన్నారు.2015 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గ్రామాలను దత్తత తీసుకోవాలని పిలుపు నిచ్చారన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు పూర్వపు కర్నూలు ఎస్పీ గా పని చేసే సమయంలో కప్పట్రాళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. దత్తత తీసుకున్న తర్వాత ఈ గ్రామం మా కుటుంబం లో భాగమయిందన్నారు.
రాష్ట్రంలో గంజాయి , డ్రగ్స్ ఎక్కడ ఉండకూడదని ఒక క్యాబినేట్ సబ్ కమిటిని ఏర్పాటు చేశారన్నారు.
పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి ఆదేశాల మేరకు విద్యార్ధులతో కలిసి ఈ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరుతో పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగిందన్నారు.ఈ పోస్టర్స్ ఆవిష్కణలో “డ్రగ్స్ మిమ్మల్నే కాదు, మీ కుటుంబాలని నాశనం చేస్తుంది”, “బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మత్తులో పిల్లల పై అఘాయిత్యాలు “, “డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోంటున్న విద్యార్దులు “ అనే పోస్టర్లను ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో పోలీసుశాఖ కూడా భాగం కావాలని గౌరవ ఎడ్యూకేషన్ మినిష్టర్ నారా లోకేష్ సూచించారన్నారు.
క్యాంపెయిన్ కార్యక్రమమే డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమమన్నారు.
యువత తప్పు ద్రోవ పడకూడదన్నారు. విద్యార్దులు చదువుకోవాలి, సాధించాలంటే ఎక్కడ ఉన్నా సాధించవచ్చన్నారు. పుస్తకాలు బాగా చదవాలన్నారు. 10 వ తరగతిలో 100 శాతం ఫలితాలు స్కూల్ విద్యార్ధులు సాధించాలన్నారు.
కుటుంబాలు గుంటూరు, తెలంగాణ ఎక్కడికైనా వలస వెళితే వారి కుటుంబాల పిల్లల కొరకు సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సహాకారంతో హస్టల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. కప్పట్రాళ్ళ గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలన్నారు. ఒకే తాటి పై ఉండాలన్నారు. విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు.
క్యాంపెయిన్ లో పాల్గొని పోలీసు పరంగా డ్రగ్స్ అనర్థాలపై అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్ధేశ్యమన్నారు.
కప్పట్రాళ్ళ గ్రామంలో పిల్లలు అందరూ చక్కగా చదువుతున్నారన్నారు. ఇక్కడ లైబ్రరీ ఉండడంతో గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదివితే అవి మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ఐజి ఆకే రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పట్రాళ్ళ గ్రామానికి వస్తుండడంతో గ్రామ ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా ఉండడం కనిపించిందన్నారు.
ఇలాంటి గ్రామ దత్తత కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని సర్వీస్ లో ఇలాంటివి చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఈరోజు నుండీ డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ ప్రారంభమయ్యిందన్నారు.
ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో చెలగాటమాడే డ్రగ్స్, గంజాయిను సమిష్టిగా నిరోధించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ పేరుతో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. గంజాయి, డ్రగ్స్ విస్తరించడంలో కీలకపాత్ర పోషించే ఫెడ్లర్స్, ట్రాన్సుపోర్టర్స్, కంజూమర్స్ పై దృష్టిపెట్టి నియంత్రించడమే లక్ష్యంగా ఉంటుందన్నారు.
ఎక్కడైనా గంజాయి సాగు, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం, తదితరాల గురించి సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 1972 కు అందించాలన్నారు.
అనంతరం ఈ గల్ ఐజి ఆకే శ్రీ రవికృష్ణ గారు, జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారులు కప్పట్రాళ్ళ గ్రామ పాఠశాల విద్యార్దులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు.
అనంతరం న్యూట్రి గార్డెన్ ఆవిష్కరణ చేశారు.
నూతన వధూవరులకు సంప్రదాయ పద్దతిలో వడి బియ్యంతో పోసి పట్టు వస్త్రాలను వధూ వరులకు అందజేశారు. గ్రామంలోని ముద్రాయిని చెరువు కుంట యొక్క పూడిక, సుందరీకరణ కు భూమి పూజ చేశారు.
గ్రామంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, తానా సంస్ధ పొట్లూరి రవి , వాల్మికి సంఘం స్టేట్ చైర్మన్ బొజ్జమ్మ , పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య , దేవనకొండ సిఐ వంశీనాథ్, ఎంపిటిసి రూపమ్మ, అవోపా నాగేశ్వరరావు, సర్పంచ్ చెన్నమ నాయుడు , కప్పట్రాళ్ళ గ్రామ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రశాంతి, దేవి యాడ్స్ విజయభాస్కర్, వ్యవసాయ అధికారి అక్బర్ భాషా, గ్రామా జ్యోతి కోఆర్డినేటర్ నారాయణ , కోరమాండల్ ఫర్టీ లైజర్ వారు, కప్పట్రాళ్ళ గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్దులు పాల్గొన్నారు.