
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఏడిఫై విద్యార్థి
కర్నూలు, న్యూస్ వెలుగు; 23 నుండి 25 వరకు విజయవాడ లో జరగబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ విలువిద్య ఛాంపియన్‌షిప్ లో ఏడిఫై పాఠశాల విద్యార్థి వర్షిత్ ఎంపికైనట్టు పాఠశాల ప్రిన్సిపాల్ జోసెఫ్ డేవిడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల ఆవరణలో క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జిల్లా కర్నూలు జిల్లా విలువిద్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీలలో మా పాఠశాలకు చెందిన 8వ తరగతి చదువుతున్న వర్షిత్ ఉత్తమ ప్రతిభను కనబడచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు,శుభ పరిణామం అన్నారు. కార్యక్రమంలో కోచ్ వంశీకృష్ణ ,కోఆర్డినేటర్స్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!