
వైకుంఠ ఏకాదశికి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; రెండవ అయోధ్య ఆంధ్ర భద్రాచలం ఏకశిలానగరంగా పేరు ప్రఖ్యాతులు గడిచిన ఒంటిమిట్ట క్షేత్రం టీటీడీ మహా సంస్థానంలోకి విలీనమైన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా టీటీడీ పర్యవేక్షకులు ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పచ్చటి మామిడి తోరణాలతో ,అరటి పిలకలతో, వివిధ రకాల పుష్పాలతో దేదీప్యమానంగా అలంకరిస్తున్నారు. అదేవిధంగా పర్వదినం రోజు వేకువ జామున నుంచి పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఉత్తర గాలిగోపురంలో గరుత్మంత వాహనంలో శ్రీ సీతా లక్ష్మణ సమేతుండై శ్రీ కోదండ రామస్వామి కొలువుతీరి ఉన్న సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా వస్తున్న నేపథ్యంలో అత్యంత సౌకర్యవంతంగా తూర్పు భాగం నుంచి ఉత్తర భాగం గాలిగోపురం వద్దకు వచ్చేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వేకువజాముననే ఆలయ అర్చకులు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి ఉత్సవ వరులను అభిషేకాలు నిర్వహించి నూతన వస్త్రాలతో, కనక భూషణ పుష్ప మాలికలతో దేదీప్యమానంగా అలంకరించి గరుత్మంత వాహనంపై ఉత్తర గాలిగోపురం వైపు ఆ సీన్లను గావించి ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివార్ల దర్శన భాగ్యాలను కల్పిస్తున్నారు. అనంతరము గ్రామ పురవీధుల్లో శ్రీ సీత లక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవమూర్తులను పల్లకిపై ఆ సీన్లను గావించి టీటీడీ పాలకులు ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాద వినియోగము పంపిణీ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలిగించకుండా టీటీడీ పాలకమండలి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. స్థానిక పోలీసులు ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం లేకుండా వాహన నిలుపుదల సౌకర్య ప్రాంతాలను ఏర్పాటుచేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.