అమ్మవారికి పవిత్ర సారె సమర్పించిన అన్నదానం విభాగం భక్తులు
విజయవాడ: ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం లో ఆలయ అన్నదానం విభాగం వారు ప్రతి సంవత్సరం వలె శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఆలయ అన్నదానం విభాగం వారి ఆహ్వానం మేరకు డిప్యూటీ కలెక్టర్ మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు విచ్చేయగా అన్నదాన అధికారులు వీరికి స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం అన్నదానం కార్యాలయంలోని దేవతా చిత్ర పటముల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించి కార్యనిర్వాహనాధికారి వారు, ఈ ఈ లింగం రమ , ఉప కార్యనిర్వాహనాధికారి వారు మరియు ఏఈఓ కొబ్బరికాయలు కొట్టి సారె కార్యక్రమంను ప్రారంభించారు. అనంతరం వీరు కుటుంబసభ్యులతో కలిసి ఊరేగింపుగా కనకదుర్గానగర్ మీదుగా ఆలయమునకు చేరుకొనగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా అన్నదాన విభాగం వారు అమ్మవారిని దర్శించుకొని, ఈవో చేతుల మీదుగా సారె సమర్పించారు.అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి, అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమములో ఆలయ ఉప కార్యనిర్వాహణాధికారి లీలాకుమార్, కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమాదేవి, ఏ ఈ ఓ లు పి. చంద్రశేఖర్, ఎన్.రమేష్ , అన్నదానం పర్యవేక్షకులు హేమ, వైదిక సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.