ప్రతి విద్యార్థి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి
న్యూస్ వెలుగు, కర్నూల్; ప్రతి విద్యార్థి రాజ్యాంగం గురించి తెలుసుకొని నడుచుకోవాలి అని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టి నర్సమ్మ అన్నారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాలేజీలోని ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను విధులను తెలుసుకోవాలని తద్వారా బాధ్యతగల పౌరుడిగా సమాజం లో మెలగాలని అన్నారు. అనంతరం విద్యార్థులచే రాజ్యాంగ పీఠిక ను పఠనం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ విజయానంద్ బాబు ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!