
అధికార పార్టీపై ఆరోపణులు చేసిన మాజీ మంత్రి బుగ్గన
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి YSRCP సీనియర్ నాయకులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధికారపార్టీ పై మండిపడ్డారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే పై అగ్రహించారు. YSRCP హయాంలో తీసుకొచ్చిన అనేక అభివృద్ది కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని అగ్రహించారు. నియోజవర్గంలో ఎస్సీ హాస్టలు, ITI కాలేజీ , తాగునీటి పైపులైన్ , రైల్వే అండర్ పాస్ బ్రిజ్డ్ , పాలిటెక్నిక్ కాలేజీ వంటి అనేక అభివృద్ది పనులను అధికారపార్టీ నేతలు అడుకోవాడమే కాకుండా ప్రజల కావాల్సిన కనీస సౌకర్యాలను , వాటి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను పనులు చేయకుండా అనేక ఆటంకాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్దికి అందరూ సహకరించాలని అంతేకాని వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని వారు అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!