
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
మార్చి 17 నుండి 31 వ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు
పరీక్షా కేంద్రాలలో తాగునీరు, లైటింగ్ వంటి వసతులన్నీ ఉండాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; మార్చి 17 నుండి 31 వ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్ లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని దిశా నిర్దేశం చేశారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు..చీఫ్ సూపరింటెండెంట్ లు వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు.. గత 3 సంవత్సరాల్లో జరిగిన సంఘటనల దృష్ట్యా సమస్యాత్మకంగా గుర్తించిన పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ కేంద్రాల్లో సజావుగా పరీక్షలు జరిగేలా పోలీసులు, తహసీల్దార్ల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను చీఫ్ సూపరింటెండెంట్ లు వెళ్లి, పరిశీలించి, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.. 39 పోలీస్ స్టేషన్ లను స్టోరేజ్ పాయింట్ లుగా గుర్తించడం జరిగిందని, పరీక్ష సమయం పూర్తి కాగానే ఆన్సర్ షీట్ లు పోస్టాఫీస్ కి చేరే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.. స్టోరేజ్ పాయింట్ లను కూడా ముందుగానే చూసుకోవాలని కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్ లను ఆదేశించారు.. స్టోరేజ్ పాయింట్ వద్ద క్వశ్చన్ పేపర్ ప్యాకెట్ లను తీసుకునే సమయంలో ఎగ్జామినేషన్ తేది, సబ్జెక్టు , పేపర్ కోడ్, మీడియం లను అక్కడే వెరిఫై చేసుకోవాలన్నారు.. ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉన్న ప్రతి రూమ్ లో ఎగ్జామినేషన్ టైం టేబుల్ ను పెట్టాలన్నారు..జిరాక్స్ షాప్ సెంటర్లు పరీక్ష కేంద్రాల వద్ద లేకుండా కార్మిక శాఖ అధికారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.. మొబైల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ వాచ్ లను పరీక్ష కేంద్రాల లోపలికి తీసుకొని రాకుండా చీఫ్ సూపరింటెండెంట్ లు చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు… ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక‌్షన్ అమలు చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.. పరీక్ష కేంద్రాలలో త్రాగు నీటి సౌకర్యం, లైటింగ్ సౌకర్యాలు ఉన్నాయా? లేదా? ముందుగానే తనిఖీ చేసుకోవాలన్నారు..మాల్ ప్రాక్టీసెస్, మాస్ కాపీయింగ్ లాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అటు విద్యార్థి భవిష్యత్తుకు, ఇటు మీ కెరియర్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ లను ఆదేశించారు.. వాల్ లేని హైస్కూళ్ల కు ఎస్టిమేట్లు వేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు..కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్ పాల్, ఎగ్జామినేషన్ నోడల్ ఆఫీసర్ చంద్రభూషణ్, డిప్యూటీ డిఈవో లు, చీఫ్ సూపరింటెండెంట్ లు తదితరులు పాల్గొన్నారు..