
బలవంతపు వసూళ్లు చేయడం దారుణమైన చర్య
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగినటువంటి వరద నష్టాన్ని కేంద్రం నుంచి కొంత నిధులను తీసుకురావాలి కానీ, ఎక్కడైనా అప్పులు తీసుకొచ్చి వరద బాధితులకు ఉపయోగించాలి గాని డ్వాక్రా సంఘాల నుండి బలవంతపు వసూలు చేయటం హేయమైన చర్యని వైయస్సార్ సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఉప్పలపాటి యోబు విమర్శించారు. విజయవాడలో జరిగినటువంటి వరద నష్టాన్ని నివారించుకోవడానికి మీరు ఆఒక్కో డ్వాక్రా సంఘానికి 500 లేదా వెయ్యి చొప్పున ఇవ్వాలని చెప్పడం మంచి పద్ధతి కాదు. డ్వాక్రా సంఘాల వారు మనస్పూర్తిగా డబ్బులు ఇస్తే తీసుకోవాలి గానీ బలవంతపు వసూలు చేయటం మరి దారుణమైన చర్య అని ఆయన ప్రభుత్వంపై విమర్శించారు.
Was this helpful?
Thanks for your feedback!