
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి
పి. రామచంద్రయ్య డిమాండ్
పత్తికొండ న్యూస్ వెలుగు ప్రతినిధి: దేశానికి అన్నంపెట్టే అన్నదాతగా ఉన్న రైతన్న పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఆంద్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు.
సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయం చదువుల రామయ్య భవన్ లో రైతన్న డైరీని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ రైతులు పండించిన పంట ఉత్పత్తులు కు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆయన కోరారు. మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవరిస్తుండడం పై దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.
రైతు నాయకుడు దలేవల్ రైతుల పక్షణా వివిధ డిమాండ్ల సాధన కోసం గత నవంబర్ 26 నుంచి పంజాబ్ – హర్యానా మధ్య ఖనౌరి సరిహద్దు వద్ద నిరవధిక నిరాహార దీక్ష సేసారని ,అయితే ఆయన ఆరోగ్యం క్షిణించడం తో ఆసుపత్రికి తరలించారని దాంతో దిగొచ్చిన ప్రభుత్వం నిరసన తెలుపుతున్నా రైతులతో కేంద్రం వీలైనంత త్వరగా చర్చలు జరుపుతామని హామీఇచ్చారని తెలిపారు.
రైతు ఉద్యమా ఫలితంగా రైతులతో ఫిబ్రవరి 14 చర్చలకు ఆహ్వానించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు పి. భీమలింగప్ప, సీపీఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, కౌలు దారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. తిమ్మయ్య, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బి. సురేంద్ర కుమార్, రైతు సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు ఎం. కారన్న, రైతు సంఘం మద్దికెర మండల అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.