వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

పత్తికొండ (న్యూస్ వెలుగు ):   పందికోన గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు బుల్లేని రంగస్వామి కుమారుడు వివాహానికి, అలాగే పత్తికొండ పట్టణం ముస్లిం వీధి పోస్టాఫీస్ భాష  కుమారుడు, చాంద్ బాషా  కుమార్తె వివాహానికి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తరువాత, ఇటీవల పత్తికొండ పట్టణంలో జరిగిన లారీ ప్రమాదంలో గాయపడ్డ తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామానికి చెందిన గొల్ల శిరీష, భూమిక, చిన్నారి శ్రీనితిక కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని కోరారు.  అలాగే ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న ముక్కెళ్ల గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లును కలసి ఆరోగ్యస్థితి గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి కొద్ది రోజుల క్రితం మృతిచెందిన తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే గారితో పాటు వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!