వచ్చే ఎన్నికల్లో ఉచిత పథకాలకు మంగళం పాడాలి

వచ్చే ఎన్నికల్లో ఉచిత పథకాలకు మంగళం పాడాలి

చంద్రబాబు నాయుడుకు కొత్తూరు సత్యం సలహా

న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేశాడని తను ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని చెప్పడం జరిగిందన్నారు . చంద్రబాబు నాయుడుకు ఒక చిన్న సలహా ఇస్తున్నానని ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ప్రజల నుండి రోజుకు ఒక రూపాయి రాష్ట్ర ఖజానాకు పంపాలని పిలుపు ఇవ్వాలి అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఒక రూపాయి ఆంధ్ర ప్రాంతం నుండి ప్రతి ఒక్కరూ రెండు రూపాయలు విరాళంగా పంపించాలని పిలుపు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్ల జనాభా ఉందని రోజుకు ఒకరు ఒక్క రూపాయి ఇచ్చిన రోజుకు నాలుగు కోట్ల రూపాయలు అవుతుందన్నారు. నెలకు 120 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వస్తుందన్నారు. అయితే ప్రజలపై భారం వేయకుండా చర్యలు తీసుకుంటే ప్రజలు స్వచ్ఛందంగా వస్తారన్నారు. నెలకు 120 కోట్లు ఏడాదికి ఎన్ని కోట్లు అవుతాయో ఆలోచన చేయాలన్నారు. వచ్చిన విరాళాలు సక్రమంగా వినియోగిస్తే ప్రజలు మరింత ముందడుగు వేసే అవకాశం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉచిత పథకాలకు మంగళం పాడాలని కేవలం విద్యా, వైద్యం, వ్యవసాయానికి మాత్రమే పథకాలు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!