
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూల్ లో శరీన్ నగర్ పట్టన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని విఠల్ నగర్ లో జరుగుచున్న ఫ్రైడే -డ్రై డే కార్యక్రమాన్ని డెమో శ్రీనివాసులు తనిఖీ చేసారు. ఈ సందర్బముగా మాట్లడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే – డ్రై డే కార్యక్రము బాగంగా ఆరోగ్య సిబ్బంది వారి పరిధిలోని ప్రాంతాలను సందర్శిoచి ప్రజలు వారానికి ఒకసారి నీటి నిల్వలు లేకుండ పూర్తిగా తొలగించి దోమలు పెరుగుదలను అరికట్టవిదంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ వివరాలను ఫ్రైడే – డ్రై డే app నందు క్రమంతప్పక అప్ లోడ్ చేయాలని,ఒకవేల నీటి నిల్వలు గల ప్రాoతలను గుర్తించినట్లు, వివరాలను వెక్టార్ కంట్రోల్ హైజిన్ app నందు అప్ లోడ్ చేసి మరియు సంబoదిత సచివాలయ సెక్రెటరీ ద్వారా సమస్య పరిష్కారం అగునట్లు చూడాలని ఆదేశించారు.
ఈ కార్యకమములో డిప్యూటీ డెమో చంద్రశేఖర్ రెడ్డి ,ఆరోగ్య భోదకురాలు పద్మావతి , సచివాలయ ఆరోగ్య కార్యకర్త రేణుక గారు,, ఆరోగ్య సిబ్బంది , జ్యోతి,శ్రావణి ఆశా కార్యకర్తలు మరియు ప్రోజేక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.