“ఎ.ఎన్.యు.ఫోటో గ్రాఫర్ గుత్తా సునీల్ కుమార్ కు బంగారు పతకం”

“ఎ.ఎన్.యు.ఫోటో గ్రాఫర్ గుత్తా సునీల్ కుమార్ కు బంగారు పతకం”

ఎందరినో ఆకర్షిస్తున్న సునీల్ ఫోటో గ్రఫీ

తన ఫోటోలతో సామాజిక స్థితి గతులను చూపిన సునీల్

ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె. రామ్మోహన్ రావు అభినందన

ఫోటో గ్రాఫర్ ను ప్రశంసించిన ఎ.ఎన్.యు.సిబ్బంది

 నాగార్జున వర్సిటీ, న్యూస్ వెలుగు;  కాలగర్భంలో కలిసిన చరిత్రను,మన కళ్ల ముందు ఎన్నో జ్ఞాపకాలను సజీవంగా నిలిపేవీ ఫోటోలు. ఆలోచనలకు ఆసక్తికి,తనలోని సామాజిక దృష్టి కోణానికి నిదర్శనం గా అతికొద్ది మంది ఫోటోగ్రఫీ మాత్రమే ప్రజల హృదయాలను తాకుతుంది. ఈ కోవకే చెందిన ఉత్తమ ఫోటోగ్రాఫర్ గుత్తా సునీల్ కుమార్. గత దశాబ్దంన్నర కాలానికి పైగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల నందలి పాత్రికేయవిద్యా విభాగంలో విశ్వవిద్యాలయ ఛాయాచిత్ర గ్రాహకుడిగా విధులునిర్వహిస్తున్నాడు. తనదైన శైలిలో పలు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఉత్తమ ఛాయాచిత్ర గ్రాహకుడిగా, ఉన్నతశ్రేణి డిగ్రీలను పురస్కారాలు సైతం పొందారు. ఈ క్రమంలో ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా& ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పాత్రికేయ విద్యా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఫోటో ల ప్రదర్శన పోటీలో బంగారు పతకం సాధించాడు. స్వర్గీయ ఎమ్. పద్మనాభరావు స్మారక పురస్కారంగా బంగారు పతకాన్ని ,ప్రశంసా పత్రాన్ని132వ ప్రపంచ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ దినోత్సవం నాడు విశ్వవిద్యాలయంలో అందుకున్నారు. ఈ పురస్కారాన్ని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె. రామ్మోహన్ రావు చేతుల మీదుగా సునీల్ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భముగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పాత్రికేయ విద్యా భాగాధిపతి ఆచార్య కే .జ్యోతిర్మయి, టి.వి.&ఫిల్మ్ కోర్సెస్ సమన్వయకర్త ఆచార్య జె.మధుబాబు మాట్లాడుతూ స్వీయ ఆసక్తితో,ఫోటో గ్రఫీ రంగం పై మక్కువతో తన ఫోటోలతో సామాజిక స్థితి గతులను సునీల్ చూపుతున్నారని, దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాలలో, గిరిజన నివాసాల లో సైతం పర్యటించి వారి జీవన స్థితిగతులను తన ఫోటోలతో చూపుతున్నాడని కొనియాడారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, రెక్టార్ ఆచార్య రత్నషీలామణి,ఆర్ట్స్,లా కళాశాల ప్రచార్యులు ఆచార్య ఎమ్.సురేష్ కుమార్,వ్యాయామ విద్యా సంచాలకులు ఆచార్య పి.పి.ఎస్. పాల్ కుమార్,అధ్యాపకులు శ్రీనివాసరెడ్డి, విశ్వవిద్యాలయ బోధన,బోధనేతర సిబ్బంది సునీల్ కుమార్ కు అభినందనలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!