
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం :కాంగ్రెస్ నేత బీమ
న్యూస్ వెలుగు పత్తికొండ: అన్నదాత సుఖీభవ పథకం పై రైతులు పెట్టుకున్న ఆశలు నీటిపై బుడగల్లా మారిందని కాంగ్రెస్ నేత బీమ టీడీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని , చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. రైతులకు ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన ఆర్థిక సహకారం అందించక పోవడం రైతులను నిరాశకు గురి చేసిందన్నారు. రైతులు ఖరీఫ్ లో సాగుచేసేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కునే పరిస్థితి నెలకొంది , రైతులు గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించలేక , వర్షాలు సకాలంలో కురవక , పండిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు పెత్తం దారులకు , బడా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టే పరిస్థితి కి వచ్చిందని , పరిశ్రమలకు సబ్సిడీ ల లో భూమి , నీరు , కరెంటు , బ్యాంకు రుణాలు వంటి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నారని , అన్నం పెట్టె రైతుకు ఎలాంటి సౌకర్యలు ప్రభుత్వం కల్పిస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భూమి సాగుచేస్తున్న రైతుల దగ్గరకు తనే స్వయంగా వెళ్లి రైతుల సమస్యలను అడిగినట్లు తెలిపారు.