రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం: ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం: ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

పత్తికొండ(న్యూస్ వెలుగు): చిన్నహుల్తి గ్రామంలో సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేస్తోందన్నారు. వైసిపి గవర్నమెంట్ లో నిలిచిపోయిన సబ్సిడీ డ్రిప్ పరికరాలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 90% సబ్సిడీతో రైతులకు అందజేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందజేసి ఆదుకుంటామని తెలిపారు. రైతులు రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతులు పాటించి సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులను కోరారు.అనంతరం రైతులకు ఏవో వెంకట రాముడు ఆధ్వర్యంలో రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్యామ్ కుమార్. ఈ కార్యక్రమంలో రైతులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!