
ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలని ఆశా వర్కర్లు ధర్నాలను నిర్వహించారు. మంగళవారం రోజున మండల పరిధిలోని గల తుగ్గలి మరియు పగిడి రాయి ప్రాథమిక వైద్యశాలల వద్ద ఆశా వర్కర్లు ధర్నాలను నిర్వహించారు. ఈ ధర్నాలలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గోపాల్, సిఐటియు మండల అధ్యక్షులు రంగస్వామి మరియు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శ్రీరాములు మద్దతు తెలిపి ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వారు తెలియజేశారు.అనంతరం తుగ్గలి మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ కు మెమొరాండంను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు షకీనాభి,నాగవేణి,త్రివేణి,రంగమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.