రైతుల ఖాతాల్లో నగదును జమచేయనున్న ప్రభుత్వం..!

రైతుల ఖాతాల్లో నగదును జమచేయనున్న ప్రభుత్వం..!

న్యూస్ వెలుగు అమరావతి:  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు . అందులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని జూన్ 20 నుంచి అమలు చేసేందుకు సిద్ధమైంది. పథకానికి సంబందించిన నిధులను ఇప్పటికే ఆర్థిక శాఖా అనుమతితో నిధులను విడుదల చేసినట్లు మంత్రి నారాలోకేష్ తెలిపారు . ఆంధ్రప్రదేశ్ రైతులకు వార్షిక ₹20,000 ఆర్థిక సహాయం అందిస్తూ, ఇది రాష్ట్ర ₹14,000 + కేంద్ర PM-Kisan ₹6,000 తో కూడిన పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ మొత్తాన్ని ఒక్కరికి ఏడాదుకు ₹20,000గా మూడు విడతలుగా ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.  ఈ పథకాన్ని అధికారికంగా 2024 డిసెంబరులో మొదలైనప్పటికీ  2025  జూన్ 20 నుంచి మొదటి విడతగా ₹7,000 (₹5,000 రాష్ట్ర + ₹2,000 కేంద్రం) రైతుల ఖాతాల్లో జమ చేయటం ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖా మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో నివాసం కలిగిన రైతులు (భూమి యజమానులు లేదా అద్దె రైతులు – కౌలు రైతులు) అర్హులు,  PM-Kisan అలవెన్స్ పొందేవారునే దీనికి అర్హులుగా పరిగణించబడతారు.  కౌలు రైతులు కూడా, ఎంతైనా CCR కార్డు లేకపోయినా, ఈ పథకానికి అర్హులు  . అయితే KYC ని సుమారు 4.4 లక్షల మందికి ఇది ఆటోమేటిక్‌గా పూర్తిచేయబడిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

Author

Was this helpful?

Thanks for your feedback!