భోజనం గ్రామంలోభూముల రీ సర్వేపై గ్రామ సభ
బండి ఆత్మకూరు వెలుగు న్యూస్: బండి ఆత్మకూరు మండలంలోని భోజనం గ్రామంలో భూముల రిసర్వే సమస్యల పరిష్కారానికె గ్రామసభ నిర్వహించామని ఎమ్మార్వో ఆల్ఫ్రెడ్ ధోని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ
గత ప్రభుత్వంలో రైతుల భూములను భూ రీసర్వే పూర్తి చేయడం జరిగిందని అయితే భూ రీసర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహిస్తుమన్నారు. రైతులకు భూ సమస్యలు ఏమైనా ఉంటే గ్రామసభ ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకోవాలని కోరారు. ఈ గ్రామసభ నందు పట్టాదార పాస్ పుస్తకంలో పేరు మార్పు కొరకు 20 అర్జీలు జాయింట్ ఎల్ పి యమ్ సబ్ డివిజన్ కొరకు 25 అర్జీలు పొలం విస్తీర్ణం మార్పునకు 39 అర్జీలు సవరణ కొరకు మూడు అర్జీలు మొత్తం 84 అర్జీలు స్వీకరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గంతెలుగు యువత అధ్యక్షుడు బొల్లవరం మల్లేశ్వర్ రెడ్డి మండల సర్వేయర్ పర్వీన్ గ్రామ సర్వేయర్ జావిద్ హుస్సేన్ వీఆర్వో మద్దిలేటి తలారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.